Monday, May 21, 2012
   
Text Size

Site Search powered by Ajax

TeluguStockMarket

Market Report

5-12-11

మూడు వరుస సెషన్‌లలో లాభాలను పండించిన స్టాక్‌ మార్కెట్‌ సూచికలు కొద్దిగా జరిగిన లాభాల స్వీకరణతో నష్టపోయాయి. సెషన్‌ ఆరంభం నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన బెంచ్‌మార్క్‌ సూచికలు రోజు కనిష్ఠస్థాయి నుంచి రికవరీని నమోదు చేయగలిగాయి. స్మాల్‌, మిడ్‌కాప్‌లు దాదాపు స్థిరంగా నిలిచాయి. యూరప్‌ నుంచి అందుతున్న సంకేతాలే మార్కెట్‌ గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌ ముగిసే సరికి బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ సూచి 41.50 పాయింట్లు పడిపోయి 0.25 శాతం నష్టంతో 16,805.33 పాయింట్ల వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 11 పాయింట్లు పడిపోయి 0.22 శాతం నష్టంతో 5,039.15 పాయింట్ల వద్ద కొనసాగాయి. లాభాలను నమోదుచేసిన ఈక్విటీల జాబితాలో జెపి అసోసియేట్స్‌, ఎన్‌టిపిసి, బిహెచ్‌ఇఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర కంపెనీలుండగా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ పవర్‌, సెయిల్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌ తదితర కంపెనీలు నష్టపోయాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ - 30లో 13 కంపెనీలు లాభపడ్డాయి. బిఎస్‌ఇ - 500లో 248 కంపెనీల ఈక్విటీలు లాభపడగా మొత్తం 1,414.71 కోట్ల రూపాయల టర్నోవర్‌ నమోదైంది.

 
Move
-

ఫైనాన్స్

Top Headline

ఐదు వేల రూపాయల కనీస సింగిల్‌ ప్రీమియం చెల్లింపుతో పెట్టుబడి పెట్టిన మొత్తంపై జీవిత బీమాతో పాటు 200 శాతం రాబడిని గ్యారంటీగా అందించేలా బజాజ్‌ అలయన్స్‌ రూపొందించిన యులిప్‌ 'గ్యారంటీడ్‌ మెచ్యూరిటీ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్‌-జిఎంఐపి' మార్కెట్లోకి విడుదలైంది. సమాజంలోని అన్ని రకాల ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండేలా దీన్ని తయారు చేశామని సంస్థ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ రితురాజ్‌ భట్టాచార్య వివరించారు. ఈ ప్లాన్‌లో ఏ విధమైన పాలసీ జారీ చార్జీలుండవని, ఐదేళ్ళ తరువాత నియమిత మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చని, పదేళ్ళపాటు బీమా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదాయపు...

Read More...

2-12-2011 డాలర్‌తో మారకపు విలువ 51.46   డాలర్‌తో రూపాయి మారకపు విలువ గణనీయంగా లాభపడింది. గడచిన రెండున్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా గురువారం నాటి ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మారకపు విలువ 1.5 శాతం మెరుగుపడింది. దీంతో క్రితం ముగింపు 52.20/21తో పోలిస్తే ఒక దశలో 51.40 రూపాయలకు చేరిన మారకపు విలువ సెషన్‌ ముగిసేసరికి 51.46/47 వద్ద కొనసాగింది. నవంబర్‌ 18 తరువాత రూపాయి విలువ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్లలో గత రెండు సెషన్‌లలో నమోదైన భారీ లాభాలు, డాలర్‌తో యూరో మారకపు విలువలో వచ్చిన మార్పుల కారణంగా రూపాయి బలపడిందని నిపుణులు వ్యాఖ్యానించారు....

Read More...

2-12-2011 రూపాయి చుట్టూ అనిశ్చిత వాతావరణం ఏర్పడేలా చేసి గందరగోళానికి దారితీసే పరిస్థితులను కల్పించవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోని బ్యాంకులకు సూచించింది. రూపాయి మరింతగా పడిపోతుందన్న భయాలు అవసరం లేదని, ఓపెన్‌ పోజిషన్లను దుర్వినియోగం చేస్తూ మరింత ఒడిదుడుకులు కలిగేలా ట్రేడింగ్‌కు దిగవద్దని కొచ్చిలో జరిగిన ఓ సమావేశంలో ఆర్‌బిఐ అధికారులు బ్యాంకులను హెచ్చరించారు. బ్యాంకులు సక్రమంగా తమ విధులను నిర్వర్తించకపోతే ఫారెక్స్‌ నిబంధనలను మరింత కఠినం చేయాల్సి వుంటుందని కూడా వారు హెచ్చరించినట్టు తెలిసింది. కాగా, ఫారెక్స్‌ మార్కెట్లో బ్యాంకుల ట్రేడింగ్‌...

Read More...

28-11-11 2011 డిసెంబర్‌తో ముగిసే మూడవ త్రైమాసికంలో విదేశాల్లోని భారతీయ కంపెనీలు నష్టాల సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. రూపాయి విలువ పతనం కావడంతో గత రెండవ త్రైమాసికంలోనే అనేక కంపెనీలు నష్టాలను చవి చూసాయి. ఇదే పరిస్థితి మళ్లీ పుఃనరావృతం కానుందని నిపుణులు భావిస్తున్నారు. గడిచిన జనవరిలో అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రూ.44గా ఉంది. ప్రస్తుతం ఇది రూ.52కు చేరుకోవడంతో 18 శాతం పైగా పతనమైంది. ఈ సమయంలో నష్టాలు మరింత పెరగవచ్చని కంపెనీలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ద్వితీయ త్రైమాసికంలో విదేశాల్లోని ప్రముఖ భారతీయ కంపెనీలైన రాంబాక్సి, జెఎస్‌డబ్లు ఎనర్జీ, ఎఎస్‌డబ్లు...

Read More...

25-11-11 అధిక స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల నేపథ్యంలో భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. గడచిన రెండు రోజుల్లో స్వల్పంగా నిలదొక్కుకున్న సూచనలు కనిపించినా గురువారం మార్కెట్‌లో రూ. 52ల ప్రాంతంలోనే ఉంది. రూపాయి విలువపై భారత్‌లో ఎల్లెడలా ఆందోళన పెల్లుబుకుతోంది. ప్రపంచంలో ద్రవ్య విలువ క్షీణించిన దేశాల్లో భారత్‌ నగదు రూపాయి నాలుగోది కావడమే దీనికి కారణం. ఆసియాలో రూపాయి పతనం ఊహకందనిదిగా మారింది. అయితే ఇప్పుడు కనిపిస్తున్న దానికన్నా అదనంగా ముంచుకొచ్చిన ముప్పేమీ లేదని ప్రపంచ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం క్రెడిట్‌ సూసీ భరోసా ఇస్తోంది. అమెరికా డాలరుతో...

Read More...
Move
-

ఈక్విటీస్

Top Headline

6-12-11 దేశంలో చమురు క్షేత్రాలను నిర్వహిస్తున్న కెయిర్న్‌ ఇండియాలో 8.7 బిలియన్‌ డాలర్ల విలువైన వాటా కొనుగోలు దిశగా వేదాంత రిసోర్సెస్‌ చేసుకున్న ఒప్పందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దేశ భద్రత పరంగా 'నో అబ్జెక్షన్‌' సర్టిఫికెట్‌ను ఇచ్చినట్టు సోమవారం నాడు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. యుకె కేంద్రంగా నడుస్తున్న కెయిర్న్‌ ఎనర్జీ పిఎల్‌సి భారత్‌లో అనుబంధ సంస్థ కెయిర్న్‌ ఇండియాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 40 శాతం వాటాలను వేదాంత కొనుగోలు చేసేందుకు గత సంవత్సరంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఒఎన్‌జిసి రాయల్టిd, క్రూడాయిల్‌ ప్రొడక్టుల...

Read More...

6-12-11 దేశంలో చమురు క్షేత్రాలను నిర్వహిస్తున్న కెయిర్న్‌ ఇండియాలో 8.7 బిలియన్‌ డాలర్ల విలువైన వాటా కొనుగోలు దిశగా వేదాంత రిసోర్సెస్‌ చేసుకున్న ఒప్పందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దేశ భద్రత పరంగా 'నో అబ్జెక్షన్‌' సర్టిఫికెట్‌ను ఇచ్చినట్టు సోమవారం నాడు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. యుకె కేంద్రంగా నడుస్తున్న కెయిర్న్‌ ఎనర్జీ పిఎల్‌సి భారత్‌లో అనుబంధ సంస్థ కెయిర్న్‌ ఇండియాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 40 శాతం వాటాలను వేదాంత కొనుగోలు చేసేందుకు గత సంవత్సరంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఒఎన్‌జిసి రాయల్టిd, క్రూడాయిల్‌ ప్రొడక్టుల...

Read More...

6-12-11 రిలయన్స్‌ ఆర్బిట్రేషన్‌ నోటీసుపై చమురు శాఖ కృష్ణా గోదావరి బేసిన్‌లో ప్రధానమైన డి-6 చమురు క్షేత్రం విషయమై చమురు మంత్రిత్వ శాఖతో వచ్చిన వివాదాన్ని కోర్టు వెలుపల పంచాయతీ ద్వారా పరిష్కరించుకుందామని ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పంపిన నోటీసుపై ఘాటైన స్పందన వెలువడింది. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము తొందర పడబోమని, ముందుగా పూర్తి విషయాన్ని అధ్యయనం చేయాల్సి వుందని చమురు శాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్‌ సింగ్‌ మీడియాకు వివరించారు. ఆర్‌ఐఎల్‌ పంపిన నోటీసు తమకు అందిందని, ఇందులో ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తామని, జాతీయ వనరులకు,...

Read More...

2-12-2011 రేపటి నుంచి ఎప్పటి డబ్బులు అప్పుడు చెల్లిస్తేనే కింగ్‌ఫిషర్‌ విమానాలకు క్లియరెన్స్‌ ఇస్తామని ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు స్పష్టం చేసింది. విమానాల పార్కింగ్‌, నిర్వహణ తదితరాల కోసం గత ఆరు నెలల కాలం నాటి బకాయిలు 90 కోట్ల రూపాయలకు చేరుకోగా, వీటిని చెల్లించే వరకూ 'క్యాష్‌ అండ్‌ క్యారీ' పద్ధతిలో నడుచుకోవాలని ఎంఐఎఎల్‌ నోటీసులు జారీ చేసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియాలకు కాపీలను పెడుతూ, కెఎఫ్‌కు మెయిల్‌ పంపింది. గతంలో ఎయిర్‌పోర్టు చార్జీలు తదితరాల చెల్లింపుల కింద కెఎఫ్‌ జారీ చేసిన చెక్‌ బౌన్స్‌...

Read More...

2-12-2011 దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన ఉత్పత్తి కంపెనీ అయిన హీరో మోటో కార్పొ గడిచిన నవంబర్‌లో 5,36,772 బైక్‌ల అమ్మకాలు చేసింది. గతేడాది ఇదే సమయంలో 4,21,366 యూనిట్స్‌ను విక్రయించింది. దీంతో పోల్చితే గడిచిన నవంబర్‌లో 27.39 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. తామ కంపెనీ నూతనంగా రూపొందించిన ఐడెంటిటీ బ్రాండ్‌ బైక్‌ అమ్మకాల వాటా 27 శాతం ఉందని ఆ కంపెనీ తెలిపింది.

Read More...
Move
-

మార్కెట్ ఫోకస్

Top Headline

6-12-11 ఇకపై ఏ సమయంలోనైనా వినియోగదారులు తాము కోరుకున్న సినిమాను వీక్షించడానికి అవకాశం కల్పిస్తోన్నట్లు డిటిహెచ్‌ సంస్థ అయిన టాటా స్కై ప్రకటించింది. క్యాచ్‌ అఫ్‌ టివి ఆఫర్‌లో భాగంగా గడిచిన ఐదు రోజుల కార్యక్రమాలను మళ్లీ వీక్షించవచ్చని ఆ కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ మెహ్రా ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఏదైన పనిలో పడిపోయి అర్థంతరంగా కార్యక్రమాన్ని వీక్షించకపోయినా, దానికి అదే రికార్డు అవుతుందని, తిరిగి తీరిక సమయంలో చూడవచ్చని తెలిపారు.

Read More...

2-12-2011 రెండు రోజుల్లో బొగ్గు నిల్వలు ఖాళీ 9 కేంద్రాల్లో పరిస్థితి తీవ్రం దక్షిణాదిన యూనిట్‌ విలువ రు.9లకు పెరుగుదల   బొగ్గు కొరత ప్రభావం విద్యుత్‌ ధరల(రేట్‌)ను ప్రభావితం చేసేదిగా మారింది. దేశంలోని ప్రధాన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తొమ్మిదింటిలో విద్యుదుత్పాదనకు అవసరమైన బొగ్గు నిల్వలు మరొ రెండు రోజులకు మాత్రమే సరిపోనున్నాయి. ఈనేపధ్యంలో విద్యుత్‌ గిరాకి అనూహ్య స్థాయికి చేరింది. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ విక్రయ విలువ ఒక్క మారుగా పెరిగింది. దేశ వ్యాపితంగా యూనిట్‌ ఒకటికి సగటున నాలుగు రూపాయిలు పెరుగుదలను నమోదు చేసుకోగా...

Read More...

2-12-2011 గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియా 6,994 కోట్ల రూపాయలను నష్టపోయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వాయిలార్‌ రవి రాజ్యసభకు తెలిపారు. ఎయిర్‌ ఇండియా 175 జాతీయ, అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడుపుతుండగా, కేవలం రెండు రూట్లలోనే లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 2008-09లో 5,548.26 కోట్ల వద్ద, 09-10లో 5,552.55 కోట్ల రూపాయలుగా నష్టం కొనసాగిందని ఎంపి వైఎస్‌ చౌదరి అడిగిన ప్రశ్నకు పంపిన లిఖిత పూర్వక సమాధానంలో రవి వివరించారు. కోల్‌కతా - యాంగాన్‌, కోల్‌కతా - ఖాట్మండు సర్వీసులకు మాత్రం అన్ని ఖర్చులూ పోను లాభాలు వచ్చాయని ఆయన వివరించారు. మరో 8 రూట్లలో ఇంధనం ఖర్చు కూడా రాలేదని,...

Read More...

2-12-2011 ఆహార ద్రవ్యోల్బణం నవంబరు 19తో ముగిసిన వారాంతానికి సుమారు ఎనిమిది శాతానికి తగ్గింది. అంతక్రితం టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) ప్రకారం ద్రవ్యోల్బణం 9.03 శాతంగా ఉంది. బంగాళదుంపలు, ఉల్లి, గోధుమల ధరల మినహా అనేక వ్యవసాయిక ఉత్పత్తుల ధరలు వార్షిక ప్రాతిపదికన పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన గణాంకాల ప్రకారం ఉల్లి 40.65శాతం, బంగాళదుంపల ధరలు 1098శాతం మందగించాయి. గోధుమల ధర 4.71శాతం మందగించింది. ఇవి కాక ఇతర ఆహార వస్తువుల ధరలన్నీ ప్రియమైనాయి. పప్పుధాన్యాల ధరలు 13.80శాతం పాలు 11.41శాతం, గుడ్లు, మాంసం, చేపలు 13.55శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 5.13శాతం పెరిగాయి.  

Read More...

1-12-2011 ఎఫ్‌డిఐపై విదేశీ ఆహార కంపెనీలు భారత్‌ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తే అవకాశాన్ని అందిపుచ్చు కుంటామని అంతర్జాతీయా ఆహార కంపెనీలు ప్రకటించాయి. ఇందులో ముఖ్యంగా లూన్‌ టాఓ, బెర్రిలైట్‌ అండ్‌ సర్పినో పిజ్జారీయా కంపెనీలు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి సిద్దం అవుతున్నట్లు పేర్కొన్నాయి. అన్ని విదేశీ కంపెనీలు కూడా ప్రాంచైజ్‌, చైన్‌ సిస్టం పద్దతిలో భారత్‌లోకి ప్రవేశించడానికి సన్నద్దం అవుతున్నాయి. దుబాయి ఆధారంగా నడుస్తోన్న బిన్‌హెండి...

Read More...
Move
-

బులియన్ / కమాడిటీస్

Top Headline

6-12-11 2011-12 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్‌-సెప్టెంబర్‌) సీజన్‌ చక్కెర ఉత్పత్తిలో 17 శాతం...

Read More...

2-12-2011 2013లో క్రూడాయిల్‌ ధర బ్యారల్‌కు 130 డాలర్లను చేరే అవకాశాలున్నాయని గోల్డ్‌మన్‌...

Read More...

28-11-11 ప్రపంచంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాను యుఎస్‌...

Read More...

Top Headlines

  • 1
  • 2
  • 3
  • 4

Live NIFTY & SENSEX

1 NIFTY Rs.4,918.95
+27.50 (0.56%)    

Polls

Where do you think Nifty will take Support

గ్రాము బంగారం ధర

Who's Online

We have 9 guests online